గ్లామర్ బాట పట్టిన .. మలయాళ కుట్టి ?

Wednesday, May 23rd, 2018, 10:55:34 AM IST

సినిమా అంటే .. గ్లామర్ ? అందుకే హీరోయిన్స్ గ్లామర్ విషయంలో కాస్త ఒక అడుగు ముందే ఉంటారు. నేను గ్లామర్ కు దూరం ఎక్సపోజ్ చేయను అన్న హీరోయిన్స్ కు పెద్దగా అవకాశాలు రావు .. వచ్చిన ఆమె క్రేజ్ ఎక్కువ పెరగదన్న విషయం ఇప్పటికే ఎందరో రుజువు చేసారు కూడా . అందుకే ఈ అమ్మడు కూడా గ్లామర్ దారిలో వెళ్లేందుకు రెడీ అయినట్టు చెప్పకనే చెప్పింది. ఇంతకీ ఎవరా భామ .. ఏమా కథ అంటే .. మలయాళ ప్రేమమ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది ఆ సినిమా తెలుగు రీమేక్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఆ తరువాత రెండు మూడు సినిమాలతో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందం .. అభినయం రెండు పుష్కలంగా ఉన్న ఈ అమ్మడికి ఈ మధ్య కాస్త అవకాశాలు తగ్గినట్టున్నాయి. దానికి కారణం చేసిన రెండు సినిమాలు పరాజయం పాలవడంతో కాస్త స్పీడ్ బ్రేకర్స్ తగిలాయి .. అయితే ఇప్పటి వరకు గ్లామర్ విషయంలో మడి కట్టుకు కూర్చుకున్న ఈ భామ ఇప్పుడు గ్లామర్ షో కి రెడీ అయినట్టు చెప్పకనే చెబుతుంది. తాజాగా ఓ మ్యాగజిన్ కోసం కొంచం గ్లామర్ టచ్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. గ్లామర్ లుక్ లో హాట్ గా అనుపమ ఉందంటూ కామెంట్స్ పడుతుండడంతో అనుపమ నెక్స్ట్ సినిమాల్లో గ్లామర్ షో చేయడం ఖాయం.

  •  
  •  
  •  
  •  

Comments