బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న అనుష్క!

Thursday, February 1st, 2018, 11:42:21 AM IST

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒక నటిగా అన్ని పాత్రలను చేస్తూ తనదైన శైలిలో హిట్స్ అందుకుంటోంది. రీసెంట్ గా ఆమె నటించిన బాగమతి కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది. మంచి స్పేప్సెన్స్ త్రిల్లర్ తో వచ్చిన భాగమతి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా అందాయి. సినిమా తెలుగుతో పాటు తమిళ్ – మలయాళం కూడా రిలీజ్ అయ్యింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే భాగమతి మొదటి వారం అన్ని భాషలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఫస్ట్ వీకెంట్ 36 కోట్లకు పైగా వసూళ్లు అందాయని సమాచారం అందుతోంది. అలాగే సెకండ్ వీక్ కూడా మౌత్ టాక్ తో సినిమా కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతోంది. అయితే ఈ వీక్ లోనే అనుష్క 50 కోట్లను ఈజీగా క్రాస్ చేస్తుందని బాక్స్ ఆఫీస్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి మొత్తంగా సినిమా ఎంతవరకు రాబోదుతుందో చూడాలి.