అనుష్క భాగ్‌మ‌తి కూడా అరుంధతి స్టైల్లోనే ?

Friday, October 27th, 2017, 06:55:37 PM IST

అరుంధతి సినిమాతో బాక్స్ ఆఫీస్ కి కొత్త పాఠాలు నేర్పిన సౌత్ బ్యూటీ అనుష్కా శెట్టి అప్పటి నుంచి కెరీర్ ను ఒక లెవెల్ సెట్ చేసుకుంటూ వస్తోంది. స్టార్ హీరోల తర్వాత అత్యధిక అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇమేజ్ ప్రస్తుతం మాములుగా లేదు. బాబుబలి హిట్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకుంది. అయితే బాహుబలి సెకండ్ పార్ట్ తర్వాత ఇంతవరకు అనుష్క ఏ సినిమాను రిలీజ్ చేయలేదు. కానీ లెట్ గా వచ్చినా మంచి సినిమాతో వస్తాను అంటోంది,

ప్రస్తుతం అనుష్క ‘భాగ్‌మ‌తి’ అనే హిస్టారికల్ మూవీని చేస్తోన్న సంగతి తెలిసిందే. పిల్ల జమిందార్ దర్శకుడు జి.అశోక్ కుమార్ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఈ సినిమాకు సంబందించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అయితే సినిమాలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తోందట. రెండు పాత్రల్లో చాలా కొత్త లుక్ కనిపించనుందని టాక్. అయితే అమ్మడు మళ్లీ అరుంధతి మ్యాజిక్ ని రిపీట్ చేయనుందా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనుష్క పుట్టిన రోజున అనగా నవంబర్ 7న ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారట. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.