ఎట్టకేలకు అనుష్క పెళ్లి చేసేసుకుంది..!!

Thursday, January 19th, 2017, 02:24:35 PM IST

anushka45
అనుష్కకు పెళ్లైపోయింది. ఎలాంటి హడావిడి లేకుండా సీక్రెట్ గా వివాహం చేసుకుందని అనుకుంటున్నారా ?అనుష్క వివాహం చేసుకుంది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో.ప్రస్తుతం అనుష్క తమిళ చిత్రం సింగం 3 లో నటిస్తోంది.సూర్య కథానాయకుడి గా తెరకెక్కుతున్న సింగం సిరీస్ లో ఇది మూడవ భాగం. తొలి రెండు భాగాల్లో సూర్య , అనుష్క లు ప్రేమికులు గా ఉంటారు. వారిద్దరికి నిశ్చితార్థం అయినట్లు మాత్రమే దర్శకుడు చూపిస్తాడు. కానీ సింగం 3 లో వీరిద్దరికి వివాహం జరుగుతుందట.

సింగం సిరీస్ లోని మూడు భాగాల్లో అనుష్క నటించింది. తొలి రెండు భాగాల్లో అనుష్క కు హీరోయిన్గా అధిక ప్రాధాన్యత నిచ్చిన దర్శకుడు హరి మూడో భాగంలో శృతి హాసన్ పాత్రకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.శృతి హాసన్ కు ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.