అనుష్క ఫోకస్ మలయాళం పై పడ్డట్టుంది ?

Friday, October 27th, 2017, 12:19:17 PM IST

దేవసేన అలియాస్ అనుష్క బాహుబలి తరువాత క్రేజ్ బాగా తగ్గిపోయింది. ఆ సినిమాకోసం ఐదేళ్లు కేటాయించిన అనుష్క కేవలం ఈ మధ్యలో రెండు సినిమాలు మాత్రమే చేసింది. ప్రస్తుతం భాగమతి సినిమాలో నటిస్తున్న ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. మెగాస్టార్ 151వ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి కానీ అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు. ఇక తమిళంలో కూడా పరిస్థితి అలాగే ఉండడంతో ఇప్పుడు ఆమె ఫోకస్ మలయాళం పై పడ్డట్టుంది. అందుకే అక్కడ ప్రయత్నాలు చేస్తుంది. మలయాళంలో మంచి కథాబలం ఉన్న సినిమాలు రూపొందిస్తారని, ఈ విషయాన్ని చాలా రోజులకు తెలుసుకున్నానని అంటుంది. అక్కడ మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేస్తానని అంటున్నది. తెలుగులో మంచి అవకాశాలు రాకపోవడం వల్లే అనుష్క మనసు మార్చుకున్నట్టుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.