ఆ దర్శకుడికే ఓకే చెప్పిన అనుష్క ?

Wednesday, March 21st, 2018, 10:53:54 AM IST

తెలుగులో లేడి ఓరియెంటెడ్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల అనుష్క ప్రస్తుతం స్లిమ్ గా మారె పనిలో బిజీగా మారింది. భాగమతి సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్న అనుష్కకు వరుస ఆఫర్స్ వచ్చినా కూడా ఏ సినిమాకు ఓకే చెప్పడం లేదు. కానీ తాజాగా ఓ దర్శకుడికి మాత్రం ఓకే చెప్పడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే భాగమతి తరువాత అనుష్క తో సినిమాలు చేయడానికి పలువురు దర్శకులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె గౌతమ్ మీనన్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పింది. దర్శకుడిగా గౌతమ్ మీనన్ కు మంచి క్రేజ్ ఉంది. తాజాగా అయన రూపొందించే సినిమాలో హీరోయిన్ గా అనుష్క ను ఎంపిక చేసారు. తెలుగుతో పాటు తమిళంలో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అనుష్క బరువు తగ్గే ప్రయత్నంలో ఉంది .. బరువు తగ్గాకా మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెడుతుందట.