సిడ్నీ మ్యాచ్ లో విరాట్ ఫ్లయింగ్ కిస్ చూడొచ్చు..?

Tuesday, March 24th, 2015, 06:09:47 PM IST


ఈనెల 26న సిడ్నీలో ఆస్ట్రేలియా ఇండియా జట్ల మధ్య వరల్డ్ కప్ రెండో సెమి ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. ఈ మ్యాచ్ కోసం ఇండియా టీం నెట్ లో తీవ్రంగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా గెలిచి ఫైనల్స్ కు చేరుకోవాలని ధోని సేన భావిస్తున్నది. ఈ తరుణంలో ధోని సేనకు ముఖ్యంగా విరాట్ కోహ్లీకి మరో గుడ్ న్యూస్ అందుతున్నది. విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ సిడ్నీకి పయనమయ్యినట్టు సమాచారం. సిడ్నీలో జరిగే మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఆమె సిడ్నీకి వెళ్లినట్టు తెలుస్తున్నది. ఇదే నిజమైతే… విరాట్ మరోసారి రెచ్చిపోవడం ఖాయం. సిడ్నీ గ్రౌండ్ లో ఫ్లయింగ్ కిస్ ను చూసే అవకాశం మనందరికీ కలుగుతుందని చెప్పవచ్చు. ఆల్ ది బెస్ట్.