మోషన్ పోస్టర్ : అనుష్క ఇలా అయ్యిందేంటి!

Wednesday, January 10th, 2018, 11:06:36 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవల ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తరువాత అనుష్క ఏమైనా మారుతుందా అంటే.. అందులో ఏ మాత్రం మార్పు ఉండదని చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. ఇక సినిమాలతో చాలా వరకు కొత్తగా ప్రయోగాలను చేస్తుంది అని ఇటీవల రిలీజ్ చేసిన ఒక సినిమా ఫస్ట్ లుక్ తో చెప్పేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క నిర్మాతగా ఒక సినిమాను చేసి మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో నిర్మాతగా మారి కొత్త కాన్సెప్ట్ తో రాబోతోంది. బెంగాలీ దర్శకుడు ప్రొసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తోన్న ‘పరి’ సినిమా మోషన్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఊహించని విధంగా అనుష్క కనిపించడంతో ఒక్కసారిగా అందరు షాక్ అవుతున్నారు. చూస్తుంటే హారర్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందని అనిపిస్తోంది. మార్చ్ 2 హోలీ ఫెస్టివల్ కి ఆ సినిమా రిలీజ్ కానుంది.