విరాట్ బట్టలు వేస్కొని అనుష్క ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

Wednesday, April 25th, 2018, 03:19:14 PM IST

పెళ్లికి ముందు అడ‌పాద‌డ‌పా మెరిసే అనుష్క – విరాట్ జంట పెళ్లి త‌ర్వాత మాత్రం రెగ్యుల‌ర్‌గా అభిమానుల‌ని ఎదో ఒక విధంగా ఆక‌ర్షిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవ‌ల జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల‌లోను త‌ళుక్కుమంటున్న‌ మెరుపుల తార అనుష్క అభిమానుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తూనే, మరో వైపు త‌న భ‌ర్త‌ని ప్రోత్స‌హిస్తుంది. ఇక విరాట్ కూడా త‌న వైఫ్ అందిస్తున్న స‌పోర్ట్‌తో గ్రౌండ్‌లో రెచ్చిపోతున్నాడు. ఈ మ‌ధ్య కాలంలో వీరిద్ద‌రు క‌లిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్య‌మాల‌లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే అడ‌పాద‌డ‌పా విరాట్ దుస్తుల‌ని ధ‌రించి ఆయ‌న‌పై త‌న‌కున్న ప్రేమ‌ని చాటుకుంటుంది బాలీవుడ్ నటి అనుష్క‌. ఆ మ‌ధ్య స్టేట్ ఆఫ్ మైండ్ పేరుతో ఉన్న విరాట్ టీష‌ర్ట్‌ని ధ‌రించిన అనుష్క తాజాగా కోహ్లి బ్లాక్ క‌ల‌ర్ టీష‌ర్ట్ వేసుకొని ఎయిర్‌పోర్ట్‌లో మెరిసింది. వెంట‌నే ఆమెని కెమెరాల‌లో బంధించిన అభిమానులు ఆ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు ఔత్సాహికులు విరాట్, అనుష్క‌ల ఫోటోల‌ని ప‌క్క‌ పక్క‌న పెట్టి ఒకరిపై ఒక‌రికి ఎంత ప్రేమ ఉందో తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అనుష్క ప్ర‌స్తుతం సూయి ధాగా చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

She is wearing his t-shirt! 😻♥✨ #VirUshka 💑 #MrAndMrsKohli ♥

A post shared by VirUshka 💑 (@_virushkaa_) on

Couple Goals! 😻♥🔥 #VirUshka💑

A post shared by VirUshka 💑 (@_virushkaa_) on

  •  
  •  
  •  
  •  

Comments