అలా చేయడం అందరూ చూసేశారు.. చాలా ఏడ్చాను : అనుష్క

Thursday, September 28th, 2017, 12:20:30 PM IST

టాలీవుడ్ లో హీరోయిన్స్ కూడా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టగలరని నిరూపించిన భామ అనుష్క. కథలో ప్రత్యేక పాత్రలు ఉంటే అనుష్క డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే అనేలా చేసింది. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తవుతున్నా ఇంకా తన అందం అభినయంతో ఆకర్షిస్తూనే. అరుంధతి లాంటి సినిమాతో ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక రుద్రమదేవి – బాహుబలి లో అమ్మడి నటనకు చాలా ప్రశంసలు అందాయి. టాలీవుడ్ లో అనుష్కను అందరు స్వీటీ అని పిలుచుకుంటారు.

అయితే కెరీర్ మొదట్లో అనుష్క నటన విషయంలో కాస్త ఇబ్బందిపడేదట. 2005 లో నాగార్జున – పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన సూపర్ సినిమా ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ సినిమాలో షూటింగ్స్ లో కొంచెం బాదపడిందట. సినిమాలోని ఒక పాటలో స్టెప్స్ వేయడానికి అస్సలు రాలేదట. సింపుల్ స్టెప్స్ అయినా సరే మూమెంట్స్ ని అర్ధం చేసుకోకుండా కష్టంగా చేయడంతో అక్కడున్న వారు తన కష్టాన్ని చూసి అయ్యో పాపం అనేవారు. అలా అందరూ జాలిగా చూసేసరికి అనుష్కకు కళ్లలో నుండి నీళ్లు తిరిగాయట. వెంటనే ఇంటికి వెళ్లి చాలా ఏడ్చేశానని అనుష్క వివరించింది. ఆ తర్వాత జాగ్రత్తగా మూమెంట్స్ ని అర్ధం చేసుకొని అన్ని సినిమాల్లో ఈజీగా చేశానని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా వచ్చినా రాగానే అందరు సింగిల్ టెక్ ఆర్టిస్ట్ లు కాలేరని తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments