అనుష్క అంత సన్నగా ఎలా అయ్యింది ?

Friday, January 27th, 2017, 01:00:57 PM IST

anushka45
బాహుబలి దీ కంక్లూజన్ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ మొదలెట్టిన రాజమౌళి మరొక పక్క నుంచి ప్రమోషన్ కూడా జోరుగా సాగిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ – అనుష్క ల ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సూపర్ హిట్ అయ్యింది. బాహుబలి కొత్త పోస్టర్ లో అనుష్క చాలా అందంగా కనిపించడమే కాదు.. తెగ స్లిమ్ గా నాజూకు నడుము అందాలతో కనిపించింది. ఈ పాయింటే అందరికీ డౌట్స్ తెప్పిస్తోంది. సైజ్ జీరో తర్వాత అనుష్క సైజ్ ఏ రేంజ్ లో పెరిగిందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ సైజ్ విషయంలో పెద్దగా మార్పుల్లేవనే విషయం తెలిసిపోతోంది. మరి బాహుబలి2 పోస్టర్లో మాత్రం ఇంత సన్నగా కనిపించడానికి.. గ్రాఫిక్స్ మాయాజాలమే కారణమా అనుకుంటున్నారు జనాలు. ఎందుకంటే.. స్వీటీ సన్నబడ్డం కోసం కొన్ని నెలల పాటు ఎదురుచూశారు జక్కన్న అండ్ టీం. అది సాధ్యం కాకపోవడంతో బొద్దు అనుష్కతోనే మిగిలిన పార్ట్ కంప్లీట్ చేశారు.