పెళ్లి సంబంధాలని రిజెక్ట్ చేస్తున్న అనుష్క .. కారణం?

Thursday, May 24th, 2018, 09:47:37 PM IST


బొమ్మాలి .. అలియాస్ అనుష్క ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె వయసు వాళ్ళు .. త్రిష, నయనతార, కాజల్ లు పెళ్లి విషయాన్నీ ఇంకా ఆలస్యం చేస్తుండగా .. గ్లామర్ భామ శ్రియ మాత్రం ఈ మద్యే ఓ ఇంటిదైంది. ఇక అనుష్క పెళ్లి కోసం ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు ఓ రేంజ్ లో ప్రయత్నాలు చేస్తుంటే .. అనుష్క మాత్రం వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తుందట. పెళ్లి చేద్దామని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే, ఈమె మాత్రం ఎందుకు నో చెబుతుందన్న విషయం కుటుంబ సబ్యులకు టెన్షన్ పట్టుకుందట. ఇంతకి అనుష్క పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా .. లేదంటే ఆమె మనసులో ఇంకెవరైనా ఉన్నారా ? అన్నది అసలు సమస్యగా మారింది. మరి ఈ విషయం పై అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి. భాగమతి తరువాత అనుష్క తాజాగా మరో థ్రిల్లర్ సినిమాకు ఓకే చెప్పింది. త్వరలోనే ఈ సినిమాను ప్రకటించనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments