పెట్రోలు బంకులో భాగమతి ?

Sunday, February 4th, 2018, 12:16:17 PM IST

తాజాగా భాగమతి సినిమాతో అదరగొడుతూ .. బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న అందాల అనుష్క ఓ పెట్రోల్ బంకులో పెట్రోలు పోస్టు కనిపించడం షాక్ ఇచ్చింది. అనుష్క పెట్రోలు బ్యాంకులో ఎందుకు ఉందని అనుకుంటున్నారా .. ? ఆ వివరాల్లోకి వెళితే నటి మంచు లక్ష్మి ఆ మధ్య మొదలు పెట్టిన మేము సైతం కార్యక్రమం రెండో సీజన్ లో భాగంగా ఆదివారం కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ సీజన్ లో అనుష్క తో షో మొదలు పెట్టనున్నారు. స్టార్స్ తో సేవ కార్యక్రమాలు చేయిస్తూ అందులో అభిమానుల ద్వారా వచ్చిన డబ్బుతో అన్నార్థులకు సహాయం అందిస్తున్న మంచు లక్ష్మి .. ఇప్పుడు అనుష్క పెట్రోలు అమ్మితే వచ్చిన డబ్బుతో ఈ సేవా కార్యక్రమం చేయనున్న నేపథ్యంలో ఫిలిం నగర్ లోని ఓ పెట్రోలు బంకు లో పెట్రోలు పొసే పని చేస్తుంది .. అది విషయం. మరి మీ అభిమాన నటిచే పెట్రోలు కొట్టించుకోవాలని ఉంటె వెంటనే చలో ఫిలిం నగర్.