భాగమతి సందడి .. సంక్రాంతికే ?

Friday, September 29th, 2017, 12:15:56 PM IST


అందాల భామ అనుష్క లేడి ఓరియెంటెడ్ సినిమాలతో మంచి ఇమేజ్ తెచ్చుకుంది. అరుంధతి సినిమాతో స్టార్ హీరోలకు ధీటుగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమారం రేపిన అనుష్క .. బాహుబలి లో దేవసేన గా తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో నటిస్తున్న మరో సినిమా భాగమతి. పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో తెరెకెక్కిస్తున్న ఈ సినిమా విడుదల పై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్ భారీగా పెరగడం వల్ల షూటింగ్ ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి .. కానీ నిజానికి సినిమా షూటింగ్ పూర్తయిందని, గ్రాఫిక్స్ కోసం ఆలస్యం అవుతున్నట్టు యూనిట్ తెలిపింది. భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్ నిర్మిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భాగమతి అనగానే .. హైద్రాబాద్ లో అప్పటి భాగమతి కథ కాదని దర్శకుడు చెబుతున్నాడు. బాహుబలి తరువాత అనుష్క మారె సినిమా చేయడం లేదు ఈ ఒక్క సినిమా తప్ప. సింగం 3, ఓం నమో వెంకటేశాయ సినిమాలు ప్లాప్ అవ్వడంతో భాగమతి పై భారీ ఆశలు పెట్టుకుంది అనుష్క. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారట ?

  •  
  •  
  •  
  •  

Comments