అత‌గాడి జీవితంలో అనుష్క రోల్‌?

Wednesday, May 30th, 2018, 03:59:10 PM IST

బాలీవుడ్ ఖ‌ల్‌నాయ‌క్ సంజ‌య్‌ద‌త్ జీవితాన్ని `సంజూ` పేరుతో వెండితెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ద‌త్ స్నేహితుడు రాజ్‌కుమార్ హిరాణీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్‌కానుంది. ఈ చిత్రంలో ఒక్కో పాత్ర‌ను రివీల్ చేస్తూ పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేస్తున్నారు రాజ్‌కుమార్ హిరాణీ. ఈరోజు ట్రైల‌ర్‌ని లాంచ్ చేయ‌నున్నారు.

ట్రైల‌ర్ వేళ వేరొక ట్విస్టుని రివీల్ చేస్తున్నామ‌ని హిరాణీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ద‌త్ బ‌యోపిక్‌లో అనుష్క శ‌ర్మ పాత్ర ఏంటో ఊహించ‌గ‌ల‌రా? అదేంటో తెలుసుకోవాల‌నుందా? అంటూ హిరాణీ ట్వీట్ చేశారు. దీనిని బ‌ట్టి ఈ బ‌యోపిక్‌లో అనుష్క శ‌ర్మ చేస్తున్న‌ది ప్ర‌త్యేక అప్పియ‌రెన్స్ అయినా.. ఆ పాత్ర‌కు చాలా ప్రాధాన్య‌త ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. న‌వ‌త‌రం క‌థానాయిక‌ల్లో అనుష్క క్రేజు అసాధార‌ణం. ఈ చిత్రంలో సోన‌మ్ క‌పూర్ టీనా పాత్ర‌లో న‌టిస్తోంద‌న్న స‌మాచారం ఉంది కాబ‌ట్టి… అనుష్క శ‌ర్మ మాధురి పాత్ర‌లో క‌నిపించ‌నుందా? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ద‌త్ త‌న కెరీర్ జ‌ర్నీలో ఆ ఇద్ద‌రితో ప్రేమ‌లో ప‌డ్డాడ‌న్న ప్ర‌చారం ఉంది. ఓ ద‌శ‌లో మాధురిని సంజూ భాయ్ పెళ్లాడ‌నున్నార‌న్న ప్ర‌చారం సాగింది.

  •  
  •  
  •  
  •  

Comments