ట్రెండీ పిక్‌: అనుష్క మైండ్ బ్లోయింగ్ షో!

Friday, May 4th, 2018, 10:30:44 PM IST

ఒక్క అనుష్క .. వంద ఎక్స్‌ప్రెష‌న్స్‌. క్యాచ్ చేసేవారికి క్యాచ్ చేసిన‌న్ని గ్లింప్స్‌. ఓవైపు ఐపీఎల్ మ్యాచ్‌ల‌లో అనుష్క శ‌ర్మ ఎక్స్‌ప్రెష‌న్స్ చూస్తున్న‌వారికి ఒక‌టే టెన్ష‌న్ టెన్ష‌న్. అసలు విరాట్ మ్యాచ్‌ల వేళ మైదానంలో ఏం చేస్తున్నా క‌ళ్లు విప్పార్చి అనుష్క వైపే చూడాల్సొస్తోంది. ఎందుకంటే ఆ టైమ్‌లో త‌న‌లోని ఉద్వేగం ఎంతో ఎక్స్‌ప్రెస్సివ్‌గా ఉంటోంది. ఇప్ప‌టికే సామాజిక మాధ్య‌మాలు స‌హా, అన్నిచోట్లా ఆ ఎక్స్‌ప్రెష‌న్స్‌కి సంబంధించిన ఫోటోలు జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి.

అదంతా అటుంచితే.. హ‌బ్బీతో పాటు అనుష్క ఇంకా ఇంకా డిఫ‌రెంట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చే స‌న్నివేశం వేరొక‌టి ఉంది. అదే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో క్రేజీగా న‌టించే స్పాట్. ఇదిగో ఇక్క‌డ అనుష్క శ‌ర్మ ఫోజు.. ఆ ఎక్స్‌ప్రెష‌న్ చూస్తుంటే మీకే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌ఖ్యాత‌ `న‌ష్‌` స‌మ్మ‌ర్ క‌లెక్ష‌న్స్ ప్ర‌మోష‌న్స్ కోసం అనుష్క శ‌ర్మ భారీ కాంట్రాక్టును కుదుర్చుకుంది. ఈ క‌లెక్ష‌న్స్ స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌. షాప‌ర్స్ స్టాప్‌లో ఈ బ్రాండ్ అందుబాటులో ఉండ‌నున్నాయి. అందుకే వాటిని లాంచ్ చేస్తూ అనుష్క శ‌ర్మ ఇలా ఫోజులిచ్చింద‌న్న‌మాట‌! ఇక కెరీర్ ప‌రంగా చూస్తే, అనుష్క శ‌ర్మ .. షారూక్ `జీరో` చిత్రంతో పాటు, ప‌లు భారీ ప్రాజెక్టుల్లోనూ న‌టిస్తోంది.

Comments