కేదార్‌నాథ్‌లో భాగమతి పూజలు

Thursday, May 3rd, 2018, 03:24:51 PM IST

అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాలతో స్టార్ హీరో రేంజ్ అందుకున్న టాలీవుడ్ అందాల భామ అనుష్క. రీసెంట్ గా భాగమతి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సారి లేడి ఓరియంటడ్ ఫిలిమ్స్ లో తానె దిట్ట అని మరోసారి చాటి చెప్పింది ఈ యోగా బ్యూటీ. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. త్వ‌ర‌లో గౌత‌మ్ మీనన్ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నుంది అనుష్క‌. ప్రతీ సంవత్సరం ఫేల్యూర్ ల బాటన పోకుండా ఎప్పుడూ సినిమాలు చేస్తూ ఎక్కడా ఆగకుండా ఎదో ఒక సినిమాతో అటు సినీ అభిమానుల్సి, ఇటు అనుష్క అభిమానుల్ని అలరిస్తూనే ఉంది. అయితే ఈ అమ్మ‌డు రీసెంట్‌గా కేదార్‌నాథ్ వెళ్లింది. కాలి బాట ధామానికి చేరుకొని మ‌హాశివుణ్ణి ద‌ర్శించుకుంది. తిరుగు ప్ర‌యాణంలో గుర్రం స‌హాయంతో 17 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించింది. అయితే అక్క‌డ అనుష్క‌ని చూసిన కొంద‌రు ఆమెతో ఫోటోలు దిగేందుకు పోటీలు ప‌డ్డారు. ప్ర‌స్తుతం అనుష్క ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.