ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోద‌రుడు మృతి

Thursday, July 11th, 2019, 12:09:08 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుస‌ర్ల క‌న్న‌బాబు సోద‌రుడు కుస‌ర్ల సురేష్ బుధ‌వారం రాత్రి ఆక‌స్మిక మ‌ర‌ణం చెందార‌ని తెలుస్తోంది. గుండె నొప్పి తీవ్రంగా ఎటాక్ చేయ‌డంతో ఆయ‌న విజ‌య‌వాడ‌లో మృతి చెందారని వెల్ల‌డైంది. కుస‌ర్లు సురేష్ కి `సోగ్గాడే చిన్ని నాయ‌నా` ఫేం .. ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ స్వ‌యానా త‌మ్ముడు. ఈ వార్త‌కు సంబంధించిన ఇత‌ర‌త్రా స‌మాచారం తెలియాల్సి ఉందింకా.

క‌ళ్యాణ్ కృష్ణ‌ సోద‌రుని మృతికి ప‌లువురు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నారు. సురేష్ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నారు. ఇక‌పోతే క‌ళ్యాణ్ కృష్ణ ప్ర‌స్తుతం నాగార్జున హీరోగా న‌టించ‌నున్న `బంగార్రాజు` చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు ప్రిప‌రేష‌న్ లో ఉన్నారు. సోగ్గాడే చిన్ని నాయ‌నా కి సీక్వెల్ గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నారు.