ఆ జాబితాలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు..!

Sunday, June 28th, 2020, 03:00:19 AM IST


దేశంలో కరోనా రోజు రోజుకు పెరిగిపోతుంది. కరోనా బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 85% కేసులు కేవలం 8 రాష్ట్రాలలోనే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

అయితే అనందులో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, యూపీ, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. అయితే ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడంతో ప్రజలు కాస్త టెన్షన్ పడుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల్లో 87% ఉన్నట్టు ఆరోగ్యశాఖ పెరికింది.