ఏపీ, తెలంగాణ మధ్య తిరిగేందుకు రెడీ అయిన ఆర్టీసీ బస్సులు.. నేడు కీలక నిర్ణయం..!

Wednesday, June 24th, 2020, 02:58:28 AM IST


ఏపీ, తెలంగాణ మధ్య బస్సులను తిప్పేందుకు మరోసారి ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిప్పడంపై పక్కా క్లారిటీ రాబోతుంది.

అయితే గత వారం విజయవాడలో సమావేశమైన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఈ విషయంపై మరోసారి చర్చించుకునేందుకు సిద్దమయ్యారు. అయితే ఏపీ నుంచి తెలంగాణకు నాలుగు దశల్లో బస్సు సర్వీసులను ప్రారంభించాలని ముందుగానే అనుకున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం, కర్ణాటకతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించడతో బస్సు సర్వీసుల పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పంధిస్తున్నట్టు సమాచారం.