నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…

Wednesday, June 12th, 2019, 03:16:16 AM IST

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభం అవనున్నాయి… కాగా మొదటి రోజు ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు అధ్యక్షతన శాసన సభలో అందరు సభ్యులతో పెమాణస్వీకారం చేయించనున్నారు… ఆ తరువాత రెండవరోజు అందరు కలిసి అసెంబ్లీ స్పీకర్ ని ఎన్నుకోనున్నారు… అయితే తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా అధికారపార్టీ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే… అయితే మరో రెండు రోజుల్లో పూర్తీ స్థాయి సమావేశాలు ప్రారంభం కానున్నాయి… కాగా ఆరోజు తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదే రోజు శాసనసభల వ్యవహారాల కమిటీకి సంబందించిన సమావేశం జరగనుంది. ఆ తరువాత పూర్తీ స్థాయిలో బడ్జెట్‌ కోసం జులై నెలలోనే అసెంబ్లీ మరోసారి సమావేశం జరగనుందని సమాచారం. అయితే ఇప్పటికే అసెంబ్లీలో సిఎం, మంత్రుల ఛాంబర్లు సిద్ధం చేశారు. కాగా గతంలో ప్రతిపక్ష నాయకుడికి కేటాయించిన ఛాంబర్ నే ఈసారి కూడా ప్రతిపక్షనాయకుడికి కేటాయించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అసెంబ్లీ స్పీకర్ తీసుకుంటాడు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసినప్పటికీ, ప్రతిపక్ష నేత కార్యాలయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని సమాచారం. కాగా ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్నటువంటి మొదటి సమావేశం కావడంతో 1500 వందల మంది భద్రతా సిబ్బంది సోమవారం రాత్రి తగిన ఏర్పాట్లపై మాక్‌డ్రిల్‌ నిర్వహించారు.