అప్పుడు తండ్రి..ఇప్పుడు కొడుకు.. ఇదేమి కర్మరా

Wednesday, June 12th, 2019, 02:23:46 PM IST

ఆంధ్రప్రదేశ్ లో గత 25 ఏళ్లగా గమనిస్తే అధికారం అనేది ఎక్కువగా రెండు కుటుంబంలా మధ్యనే దోబూచులాడుతోంది.. నారా వారి ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీ వాళ్లే ఎక్కువగా పాలిస్తున్నారు.. అప్పట్లో దాదాపు 9 ఏళ్ల పాలించిన చంద్రబాబుకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెక్ పెట్టి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు.. ముఖ్యమంత్రిగా చేసిన బాబుని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది రాజశేఖర్ రెడ్డి ఒక్కడే, ఆ తర్వాత 2009 లో కూడా బాబుని ప్రతిపక్షంలోనే కూర్చునేలా చేశాడు.. మళ్ళీ 2014 లో ఎలాగోలా అధికారం చేజిక్కించుకొని ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు.. అప్పుడు వైఎస్ తనయుడు జగన్ ప్రతిపక్షములో వున్నాడు.

కానీ 2019 కి వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది.. ఒక్కప్పుడు ఎవరి వలన అయితే బాబు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చిందో, ఇప్పుడు అతని కొడుకు వలన మరోసారి బాబు ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చింది.. అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు ఇద్దరు కూడా చంద్రబాబుకి ఒక రకంగా చుక్కలు చూపించారనే చెప్పాలి.. ఇక తాజాగా ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగున్నాయి.. 2014 లో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీకి జగన్ మోహన్ రెడ్డి అధినేతగా వ్యవహరించారు. ఇప్పుడు అంతకన్నా కీలకమైన పొజిషన్లో జగన్ మోహన్ రెడ్డి కూర్చుంటున్నారు.. మరో పక్క అతి బలహీనమైన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కూర్చోబోతున్నారు..మొదటిసారి జరుగుతున్న సమావేశాలు కావటంతో అందరి దృష్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల మీద ఉంది..ఒక పక్క యువకుడైన జగన్ తన దూకుడుతో ప్రతిపక్షానికి చిక్కకుండా అడుగుల వేయాలని చూస్తున్నాడు, మరో పక్క తన నలభై ఏళ్ల రాజకీయానుభవాన్ని రంగరించి మరి అధికార పక్షాన్ని ఇరుగున పెట్టటానికి చంద్రబాబు సిద్ధం అవుతుంది. కాకపోతే టీడీపీ పక్క ఒక్క చంద్రబాబు తప్ప అధికార పక్షాన్ని ఢీకొట్టగలిగే నేత మరొకరు కనిపించటం పోవటం శోచనీయం..