బ్రేకింగ్ న్యూస్ : జగన్ పై కన్నా సంచలనం రేపే ట్వీట్.!

Thursday, August 22nd, 2019, 03:20:51 PM IST

ఆంధ్ర రాష్ట్రంలోని సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీ లో చాలా ఊహించని పరిణామాలే చోటు చేసుకున్నాయి.జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీ అంతా కుదేలు అయ్యిపోయింది.కానీ అసలు ఖాతా కూడా తెరవని బీజేపీ మాత్రం అధికార పార్టీను గట్టిగానే టార్గెట్ చేస్తుంది.ఇప్పటికే అటు తెలంగాణతో పాటుగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా బలమైన పార్టీగా అవతరించేందుకు మెల్లగా పావులు కదుపుతుంది.అందులో భాగంగానే ఇప్పటికే టీడీపీను ఖాళీ చేసేస్తోంది.

ఇక మిగిలి ఉన్నది ఎలాగో అధికార పార్టీ వైసీపీయే.వారని మాత్రం బీజేపీ నేతలు టార్గెట్ చెయ్యకుండా వదలడం లేదు.జగన్ మరియు వైసీపీ పార్టీలపై బీజేపీ కు చెందిన ప్రతీ నేత పెద్ద ఎత్తునే విమర్శలు చేస్తున్నారు.తాజాగా ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధినేత కన్నా లక్ష్మి నారాయణ జగన్ ను ఉద్దేశించి ఒక సంచలన ట్వీట్ పెట్టారు.గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా లేకుండా పోయిందని

“దొందూ దొందే నాటి U-టర్న్ ప్రభుత్వం : విపరీతమైన అవినీతితో కేంద్ర నిధులు మాయం చేసి ప్రధాని అన్యాయం చేశారని ప్రజలను నమ్మిద్దామని బొక్క బోర్లా పడింది.నేటి ప్రభుత్వం:స్వప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలపై తనకే నమ్మకం లేక ప్రధానిని అడ్డం పెట్టుకోడానికి ప్రయత్నిస్తోంది.” అని సంచలన ట్వీట్ పెట్టారు.మొత్తానికి జగన్ కు బీజేపీ వల్ల రాబోయే రోజుల్లో ఏమన్నా నష్టం తప్పేలా లేదు అనడానికి ఇవే సూచనలా? అనుమానాన్ని కలిగిస్తున్నాయి.