రేపే కేబినెట్ భేటీ – ఇసుక రవాణా పై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో…?

Tuesday, November 12th, 2019, 08:34:09 PM IST

ఆంధ్రప్రదేశ్ లో బుధవారం నాడు సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశాన్ని జరపనున్నారు. బుధవారం నాడు ఉదయం 11.30 గంటలకి ఈ సమావేశం ప్రారంభం అవనుందని అధికారికంగా వెల్లడించారు సంబంధిత అధికారులు. కాగా రాష్ట్రంలో గత కొంత కాలంగా జరుగుతున్నటువంటి ఇసుక కొరత, అక్రమ రవాణా, అనేక కార్యక్రమాలు, మొదలగు వాటి గురించి పలు చర్చలు జరిపి, కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం. అయితే ఈ సమావేశాల తరువాత రాష్ట్రంలోని అక్రమార్కులందరికి కూడా పెద్ద షాక్ ఇవ్వనున్నారని సమాచారం.

అయితే ముఖ్యంగా అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించడానికి అవసరమైన కీలకమైన ప్రకటనను విడుదల చేయనున్నారని సమాచారం. దీనితో పాటే రాష్ట్రంలో మరికొన్ని పథకాలు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు కూడా. ఇకపోతే నవంబర్ 14 నుంచి 21 వరకు కూడా రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామని, ఇసుక విషయంలో ఎవరైనా కూడా అవినీతికి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు.