కరోనా ఎఫెక్ట్: ఏపీలో మధ్యాహ్నం 12 తర్వాత పూర్తిగా షట్ డౌన్..!

Tuesday, May 4th, 2021, 10:12:35 PM IST

ఏపీలో కరోనా మరింతగా విజృంభిస్తున్న నేపధ్యంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణలో భాగంగా ఇప్పటికే నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా పగలు కర్ఫ్యూను కూడా అమలు చేసేందుకు సిద్దమయ్యింది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే నిత్యావసరాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇవ్వగా 12 తర్వాత అన్ని మూతపడనున్నాయి.

అంతేకాదు రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ, సహా ప్రైవేటు వాహనాల రాకపోకలపై కూడా నిషేధం విధించింది. ఈ నేపధ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల సేవలు కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మద్యం షాపులు కూడా బంద్ కానున్నాయి. అయితే కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే 45 ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సినేషన్‍లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి ఆక్సిజన్ తెప్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.