కరోనాపై పోరుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కి 1 కోటి విరాళం..!

Friday, May 22nd, 2020, 01:22:53 AM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ వంతు మద్ధతుగా కొందరు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు సీఎంఆర్ఎఫ్‌కు భారీగా విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా కరోనాపై పోరుకు ఏపీ ప్రభుత్వానికి ఏపి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ మరియు ఏపీ క్రెడాయ్ 1 కోటి విరాళం ప్రకటించారు. నేడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చెక్కును సీఎం జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్, ఏపీ క్రెడాయ్ ప్రతినిధులు, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్, ఎం. మురళి, అక్కయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.