రెండో రోజూ.. 2 లక్షల కోట్లు కురిశాయ్..!

Tuesday, January 12th, 2016, 11:16:38 AM IST


విశాఖలో నిర్వహిస్తున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు రెండో రోజు కూడా భారీ స్థాయిలో పెట్టుబడుల వెల్లువ కురిసింది. మొదటిరోజు 1.97 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే రెండో రోజు ఏకంగా ఆ సంఖ్య 2 లక్షల కోట్లను దాటేసింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పుట్టి సరిగ్గా రెండు నెలలు కూడా పూర్తి కాకముందే చంద్రబాబు ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఇంత భారీ స్పందన రావటంతో చంద్రబాబు చాలా ఉత్సాహంగా కనిపించారు.

నిన్న జరిగిన సదస్సులో ముఖ్యంగా విశాఖ ఉక్కు విస్తరణకు 38, 500 కోట్లు, కృష్ణ పట్నం పోర్టులో 3,000 కోట్లతో రీగ్యాసిఫికేషన్, అమరావతిలో 800 కోట్లతో డబ్ల్యూసీ టవర్స్, ఐటీలో 3160 కోట్ల పెట్టుబడులు రాగా మొత్తంగా రెండు రోజులకూ కలిపి 314 ఎంవోయూలు 3. 89 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదిరాయి. ఈ పెట్టుబడుల వెల్లువ చూస్తుంటే చంద్రబాబు విజన్ – 2029 పూర్తీ స్థాయిలో సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.