జగన్ మరొక సంచలనాత్మక నిర్ణయం…నిరుద్యోగులకు ఇక పండగే

Friday, October 18th, 2019, 08:43:22 AM IST

జగన్ మరొక సంచలనాత్మక నిర్ణయం తో చరిత్రలో నిలిచిపోనున్నారు. ఏపిపిఎస్సి కి సంబందించిన గ్రూప్-1, గ్రూప్-2 సహా అన్ని విభాగాల ఉద్యోగాలకు ఇంటర్వూలు తక్షణమే నిలిపేయాలని నిర్ణయించుకున్నారు. విద్యార్థుల ప్రతిభను ఆధారం చేసుకొని రాత పరీక్షల ద్వారా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఏపిపిఎస్సి అధికారులతో చర్చించిన పిదప ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగాల భర్తీ సమయం లో న్యాయ వివాదాలు తలెత్తకుండా అత్యుత్తమ పారదర్శక పద్దతిని అవలంబించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఏపిపిఎస్సి ఫలితాల విషయం లో ఎపుడు అవినీతి, అక్రమాల ఆరోపణలు వస్తూనే వున్నాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై ఇప్పటికే అభిమానులు హర్షిస్తున్నారు. ఏపిపిఎస్సిఉద్యోగాల భర్తీకి సంబంధించి జనవరి 1 న క్యాలెండర్ విడుదల చేయాలనీ అధికారులని ఆదేశించారు. ఏపిపిఎస్సి విధివిధానాల మార్పుల కోసం ఐఐఎం, ఐఐటీ ల సహకారం, భాగస్వామ్యం తీసుకోవడం తో చక్కటి మార్పు వస్తుందని భావించారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎంతో లాభదాయకం అని చెప్పవచ్చు.