ఛైర్మ‌న్ల‌కు కొత్త కుర్చీలు.. బాబు స‌ర్కార్ ఉత్త‌ర్వులు

Friday, September 30th, 2016, 12:17:26 PM IST

babu-chandra-babu
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అభివృద్ధి మంత్రం జ‌పిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇత‌ర‌త్రా నేత‌ల‌కు కంటిమీద కునుకులేకుండా రేయింబ‌వ‌ళ్లు ప‌నిచేయించ‌డ‌మే ధ్యేయంగా ముందుకు క‌దులుతున్నారు. తాజాగా ఏపీలో పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం చేపట్టింది బాబు స‌ర్కార్‌. ఆ వివ‌రాలు మీకోసం…

టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌- ప్రొ.వి.జయరామిరెడ్డి, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌- పాలి ప్రసాద్‌, కనీస వేతన బోర్డు సలహాసంఘం చైర్మన్‌- డొక్కా మాణిక్య వరప్రసాద్‌, దుర్గా మల్లీశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌- యలమంచిలి గౌరంగబాబు, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌- మహమ్మద్‌ హిదాయత్‌, మేదర కో-ఆపరేటివ్‌ సొసైటీ ఫెడరేషన్‌ చైర్మన్‌- సుందరయ్య, కృష్ణబలిజ, పూసల కో-ఆపరేటివ్‌ సొసైటీ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌- కావేటి సామ్రాజ్యం, కల్లుగీత కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌- తాతా జయప్రకాష్ నియ‌మితుల‌య్యారు.

  •  
  •  
  •  
  •  

Comments