ముగిసిన ముఖ్యమంత్రి విదేశీ యాత్ర…

Saturday, August 24th, 2019, 01:41:17 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. కాగా తన అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని నేడే స్వదేశానికి బయలుదేరారు… కాగా ఈనెల 15న సీఎం జగన్ తన కుటుంబసభ్యులతో సహా అమెరికాకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే… అయితే ఇన్నిరోజులు అమెరికా పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, అమెరికాలో పలు సదస్సుల్లో పాల్గొని, పెట్టుబడులు పరిశ్రమలు ఆకర్షించే ప్రయత్నాలు జరిపారు… కాగా జగన్ జరిపిన ఈ పర్యటనలో భాగంగా చాలా మంది పారిశ్రామిక వేత్తలతో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యి పలు చర్చలు జరిపారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేకమైన సంస్థలతో చాలా చర్చలు జరిపారు…

కాగా తన పర్యటనను ముగించుకున్న సీఎం జగన్ శనివారం తెల్లవారు జామునే 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని, అక్కడినుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న తరువాత, తెల్లవారుజామున 4.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా ప్రస్తుతానికి రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులపై అందరు కలిసి చర్చించనున్నారని సమాచారం. ముఖ్యంగా వరదలపై సమీక్షలపై చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా వరదల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కి మరియు వైసీపీ మంత్రులకు మధ్యన జరిగినటువంటి కొన్ని కొన్ని అవాంతరణీయమైన సంఘటనల కోసం తీవ్రంగా చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ శ్రేణులు తెలిపాయి… ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని పై కూడా జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం.