ఉదయభాను కి ఏపీ సీఎం హామీ – మంత్రి పదవి ఇస్తారా…?

Wednesday, June 12th, 2019, 12:58:06 AM IST

ఏపీలో జరిగిన ఎన్నికల్లో 150 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న వైసీపీ పార్టీ తన మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. కానీ ఈ ఎమ్మెల్యేలలో చాలా వరకు సీనియర్ నేతలు ఇప్పటికి కూడా అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. కాగా మొదటి నుంచి పార్టీకి లాయల్‌గా పనిచేసిన వారు, వివిధ వేదికలపై పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించినవారు, అనేక వ్యయప్రయాలకోర్చిన పార్టీని ముందుకు తీసుకెళ్లినవారిని జగన్ మోసం చేశారని వైసీపీ వర్గాలు అంటున్నాయి… కాగా ఎవరైతే ఇలా డీలా పడిపోయి ఉన్నారో, వారందరిని పిలిచి జగన్ మాట్లాడుతున్నారని సమాచారం.

ఈసందర్భంగా కృష్టా జిల్లా వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను సీఎం జగన్‌తో కలిసి చర్చించారు. అయితే ప్రస్తుతానికి ఉదయభాను కి విప్ పదవి ఇచ్చి, రెండన్నరేళ్ల తర్వాత మంత్రి పదవి ఇస్తానని హామి ఇచ్చారు. తనతో పాటు మరికొందరికి కూడా సామాజిక న్యాయం చేస్తానని మాటిచ్చారు. అందులో నగరి ఎమ్మెల్యే రోజా ఒకరు. సీనియర్ నేతలకు సరైన గౌరవాన్ని ఇచ్చి, కాపాడుకుంటామని, అందరికి న్యాయం చేస్తానని ప్రకటించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆదిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా కొందరికి నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూడా జగన్ అంగీకరించారని సమాచారం.