ఏపీ సీఎం సంచలన నిర్ణయం – భారీగా ఐఏఎస్ ల బదిలీ…

Tuesday, June 4th, 2019, 10:07:42 PM IST

ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకోవడమే ఆలస్యం, ఎన్నో కొత్త కొత్త ప్రణాళికలకు నాంది పలుకుతున్నాడు ఏపీ కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డి… తన పాలనలో పాటు సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి… తానూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పిన ఏపీ సీఎం… తొందరలోనే ఏపీని ముందు వరుసలో నిలబెడతానని చెప్తున్నాడు. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాడు… అందుకోసమనే ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు… ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో పలు జిల్లా కలెక్టర్లతో పాటు, కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, డైరెక్టర్ల బదిలీలు జరిగాయి.

ఐఏఎస్ ల బదిలీ వివరాలు…

పూనం మాలకొండయ్య – వ్యవసాయ శాఖ కమిషనర్
రజత్ భార్గవ్ – పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
కృష్ణబాబు – రవాణా, ఆర్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ
గిరిజా శంకర్ – పంచాయితీ రాజ్ కమిషనర్
పి.లక్ష్మీనరసింహం – సీఆర్డీఏ కమిషనర్వీరపాండ్యన్…కర్నూలు జిల్లా కలెక్టర్
కాటమనేని భాస్కర్ – స్పోర్ట్స్ అథారిటీ ఎండీ
ప్రద్యుమ్న – మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమిషనర్
ఎం.ఎం.నాయక్ – ఎక్సైజ్ శాఖ కమిషనర్
నాగుపల్లి శ్రీకాంత్ – ఏపీ ట్రాన్స్ పోర్టు కమిషనర్
హర్షవర్ధన్ – సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్
భాస్కర్ – ప్రకాశం జిల్లా కలెక్టర్
మురళీధర్ రెడ్డి – తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్
ముత్యాలరాజు – పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్
శేషగిరిబాబు – నెల్లూరు జిల్లా కలెక్టర్
పీయూష్ కుమార్ – కమిర్షియల్ ట్యాక్స్ కమిషనర్
విజయ్ కుమార్ – పురపాలక శాఖ కమిషనర్
ఎస్.సత్యనారాయణ – అనంతపురం జిల్లా కలెక్టర్
నారాయణ భరత్ గుప్తా- చిత్తూరు జిల్లా కలెక్టర్
శామ్యూల్ ఆనంద్ – గుంటూరు జిల్లా కలెక్టర్
కాంతిలాల్ దండే – ఇంటర్ బోర్డు కమిషనర్