సీఎం జగన్, మహేష్, పవన్ ఇంకా ఎంతోమంది కేటీఆర్ కు శుభాకాంక్షలు.!

Friday, July 24th, 2020, 11:42:17 AM IST

తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆ పార్టీ అధినేత కెసిఆర్ తనయుడు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది రాజకీయ నాయకులూ మరియు సినీ తారలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలా తెలిపిన మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.
ఇప్పుడు కేటీఆర్ కు అన్నయ్య చిరు తో పాటుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ట్వీట్ చేసి తన శుభాకాంక్షలను పవన్ కు తెలియజేసారు. “మా బ్రదర్ శ్రీ కేటీఆర్ గారికి తన హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నా అని, మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు చిలుకూరి బాలాజీని ప్రార్థిస్తున్నానని, ఈ శుభ దినం ఎంతో ఆహ్లాదకరంగా గడవాలని కోరుకుంటున్నా” అని పవన్ ట్వీట్ చేసి తెలిపారు.

అలాగే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కూడా కేటీఆర్ కు తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. “తన సోదరుడు తారక్ కు జన్మ దిన శుభాకాంక్షలు తెలుపుతున్నానని మంచి ఆరోగ్యంతో పాటు ఆ దేవుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ కోరుకుంటున్నా అని జగన్ ట్వీట్ చేసారు.

జగన్ తో పాటుగా కేటీఆర్ కు మరింత సన్నిహితులు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూడా తన విషెస్ ను తెలిపారు. కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నా అని నీ నాయకత్వం ఒక ఉదాహరణగా ఎప్పుడూ కొనసాగాలి అని ఎప్పుడు శాంతి, ఆనందంతో ఉండాలని” మహేష్ ట్వీట్ చేసారు.

వీరితో పాటు మరింత మంది ప్రముఖులు కేటీఆర్ కు విశేష్ తెలిపారు. దర్శకులు హరీష్ శంకర్ మరియు అనీల్ రావిపూడి, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత బండ్ల గణేష్, హీరో గోపీచంద్ మరియు సుధీర్ బాబు, అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇంకా చాలా మంది తెలిపారు.