తెలంగాణలో పెరుగుతున్న జగన్ క్రేజ్.. మాములుగా లేదుగా..!

Monday, October 21st, 2019, 10:05:38 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు తన ప్రభుత్వంలో అవినీతి రహిత పాలనను అందిస్తానని ఇప్పటికే మాట కూడా ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే తన మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకుని వారిని కూడా ఆ అంశంపై దృష్టి సారించేలా సూచనలు ఇస్తున్నారు.

అయితే ఏపీలో ప్రజల నుంచి మంచి ఆదరణ తెచ్చుకున్న జగన్ తెలంగాణలో కూడా మరింత పేరు తెచ్చుకుంటున్నాడు. తాను తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ఆలోచనలు కానీ అనుభవం ఉన్న నాయకులకే ఒక్కొసారి సాధ్యం కాదు అలాంటిది తొలిసారిగా ముఖ్యమంత్రి స్థానంలో నిలబడ్డ ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిజంగా గ్రేట్ అనిపించుకుంటున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటిగా నెరవేరుస్తూ అన్ని పార్టీల నాయకులతో ఔరా అనిపించుకుంటున్నాడు. మాట చెప్పినట్టుగానే నిరుద్యోగులకు లక్షలలో ఉద్యోగాలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం, రైతు భరోసా కిందా రూ. ప్రతి రైతుకు 13,500 రూపాయలు ఇస్తుండడంతో తెలంగాణలోని నేతలు జగన్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే జగన్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతుండడం, ఆర్టీసీనీ కేసీఆర్ ప్రభుత్వంలో విలీనం చేయలేకపోవడంతో ఏపీ సీఎం జగన్ అక్కడి ఆర్టీసీనీ విలీనం చేశారని ఆయనను చూసి బుద్ధి తెచ్చుకోమని కొందరు నాయకులు, ప్రజలు తెలంగాణ సీఎం కేసీఆర్‌కి బుద్ధి చెబుతున్నారంటే జగన్ ఏ మేరకు ఇక్కడ క్రేజ్ సంపాదించుకున్నారో ఇట్టే అర్ధమవుతుంది.