బిగ్ బ్రేకింగ్: జగన్ కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి ఎవరో తెలుసా..!

Sunday, June 2nd, 2019, 08:41:05 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత మూడు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసేశాడు. అయితే ఇప్పుడు వీలైనంత త్వరగా మంత్రివర్గ కేబినెట్‌ను ప్రకటించాలని డిసైడ్ అయ్యారు జగన్. అయితే ఎక్కువ మంది గెలవడం చాలా మంది మంత్రివర్గ స్థానంలో చోటు ఇవ్వమని అడుగుతుండడంతో ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏఏ ప్రాతిపదికన ఇవ్వాలి అనేదానిపై జగన్ కసరత్తు మొదలుపెట్టారు.

అయితే జూన్ 8న మంత్రివర్గాన్ని ప్రకటించి అదే రోజు వారితో అమరావతి సెక్రటేరియట్ గ్రౌండ్స్‌లో ప్రమాణ స్వీకారం చేయించాలని నిశ్చయించుకున్నారట. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయమని అధికారులను జగన్ ఆదేశించాడట. అయితే ఈ సారి జగన్ కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి లభిస్తుందనే చర్చలు బాగా వినపడుతున్నాయి. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు మాత్రం ఇద్దరు డిప్యూటీ సీఎంలకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ కూడా ఇప్పుడు ఇద్దరికి కలిపిస్తారా లేక ఒక్కరితోనే సరిపెడతారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే జగన్ ప్రతిపాదించిన పేర్లలో వైసీపీలో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు డిప్యూటీ సీఎం అవకాశం ఇచ్చే సూచనలున్నాయని వైసీపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కాపు సామాజికవర్గం నేత కావడంతో ఈయనకు డిప్యూటీ సీఎం అవకాశం కలిపిస్తే కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్టుగా ఉంటుందని జగన్ అనుకుంటున్నారట. అయితే ఈయన అల్లుడు కిలారి రోశయ్య కూడా పొన్నూర్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2014లో చంద్రబాబు సీఎం అయినప్పుడు కాపు సామాజికవర్గం నుంచి చినరాజప్పకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అయితే, కాపులకు ఇచ్చిన ఏ హామీలు అమలుకాకపోవడంతో ఈసారి వారంతా పవన్ కళ్యాణ్‌ను కూడా కాదని జగన్ పక్షాన నిలబడ్డారు. అయితే సామజిక వర్గం నుంచి ఉమ్మారెడ్డికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా కాపులు వైసీపీ వైపే ఉంటారని జగన్ భావిస్తున్నారని వైసీఎ వర్గాలు చెప్పుకుంటున్నాయట.