ఇట్స్ ఫైనల్: జగన్ కేబినెట్‌లో కొలువుదీరనున్న మంత్రులు వీరే..!

Sunday, June 2nd, 2019, 10:14:51 AM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, స్థితి గతులను చక్కదిద్దే ప్లాన్‌లో నిమగ్నమయ్యారు. అంతేకాదు ఇప్పటికే పింఛన్ల రెట్టింపు, ఉద్యోగాల ప్రకటన చేసి అందరి చేత శభాశ్ అనిపించుకున్నారు. అయితే వీలైనంత త్వరగా తన మంత్రివర్గ కేబినెట్‌ను కూడా ప్రకటించి ప్రజలకు మరింత సులువైన పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.

అయితే ఫలితాల వెలువడే కన్నా ముందు నుంచే జగన్ మంత్రి వర్గంలో వీరికి చోటు లభిస్తుంది, వారికి చోటు లభిస్తుంది అనే వార్తలు సోషల్ మీడియాలో బాగా ప్రచారమయ్యాయి. అయితే ఇప్పుడు జగన్ ప్రమాణ స్వీకారం ముగిసిన నేపధ్యంలో తన మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలనే దానిపై దృష్టి సారించారట. అందుకోసం కొన్ని పేర్లను కూడా పరిశీలించి ఫైనల్ చేసేసారట. అంతేకాదు ఒక ఇద్దరు, ముగ్గురు పేర్లను ప్రచారంలోనే మంత్రులను చేసేస్తానని చెప్పేసారు జగన్. అయితే జగన్ పరిశీలించిన పేర్లతో జూన్ 8న మంత్రి వర్గం ఏర్పాటు కాబోతోంది. అదే రోజు కేబినెట్ సమావేశం కూడా నిర్వహించాలని జగన్ భావిస్తున్నారట. అయితే నిన్నమొన్నటి వరకూ పలు జిల్లాల నుంచి పలువురి పేర్లు మంత్రులుగా వినిపించినప్పటికీ జగన్ నిర్ణయంతో ఇప్పుడిప్పుడే మంత్రులుగా ఎవ‌రికి అవ‌కాశం రాబోతోంద‌న్న‌ది ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఒకటి రెండు పేర్లు తప్పా అంతా ఈ కింద ఇచ్చిన జాబితా ప్రకారమే ఉంటుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.

జిల్లాల వారిగా కాబోయే మంత్రులు వీరే:

తూర్పు గోదావరి: పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్
పశ్చిమ గోదావరి: గ్రంధి శ్రీనివాస్, ప్రసాద రాజు
విజయనగరం: బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: ముత్యాల నాయుడు
శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావ్
నెల్లూర్: మేకపాటి గౌతం రెడ్డి
గుంటూర్: ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, మేకతోటి సుచరిత
ప్రకాశం: బాలినేని శ్రీనివాస్ రెడ్డి
కృష్ణా జిల్లా: సామినేని ఉదయభాను, పేర్ని నాని
కర్నూల్: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
కడప: అంజద్ భాషా, శ్రీనివాసులు
చిత్తూర్: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అనంతపురం: అనంత వెంకటరామిరెడ్డి