జగన్ వెంట నడిచిన ఆ నలుగురుకి ఏ పదవులు దక్కబోతున్నాయో తెలుసా..!

Sunday, June 2nd, 2019, 03:51:44 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. అయితే మూడు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అంతేకాదు జూన్ 8వ తేదిన తన మంత్రివర్గ కేబినెట్‌ను కూడా ప్రకటించబోతున్నారు. అయితే అసలు సమయం వృధా చేయకుండా వీలైనంత త్వరగా కేబినెట్‌ను ప్రకటించి మంత్రులను ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకుంటూ పాలనను సాగించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. అయితే మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలనే దానిపై విశ్లేషణలు చేపడుతున్నారు.

ఇదిలా ఉందగా జూన్ 8న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండబోతుందని జగన్ ఇప్పటికే ప్రకటించేశారు. అయితే మంత్రివర్గంలో ఎవరికి చోటు కలిపిస్తారు అనే దానిపైనే ఇప్పుడు తీవ్రమైన ఆసక్తి కనబడుతుంది. అయితే ముందు నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత కలిపిస్తారా లేక పార్టీ మారిన సీనియర్లకు అవకాశం కలిపిస్తారా అనేది మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు. అయితే ఇప్పటికే ఒకరిద్దరి పేర్లు జగన్ ప్రకటించినా మిగతా వారిలో ఎవరికి అవకాశం లభిస్తుంది అనే దానిపై పార్టీ శ్రేణుల్లో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇవి ఏ విధంగా ఉన్నా కొత్త ప్రభుత్వం ఏర్పడిన కారణంగా ఇప్పుడు నామినేటెడ్ పదవులకు కూడా పోటీ కనపడుతుంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడితే నామినేటెడ్ పదవులకు పాత వారు రాజీనామా చేయాలి. అయితే ఆ పదవులను జగన్ ఎవరికి ఇవ్వబోతున్నారనేదే ఇప్పుడు పెద్ద చర్చానీయాంశం. అయితే ఈ పోస్టులకు జగన్ పార్టీలో ఉన్న సినీ ప్రముఖులు పోటీ పడుతున్నారట. అయితే ఈ ఎన్నికలలో మోహ‌న్‌బాబు, జయ‌సుధ‌, జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌, అలీ, పోసాని, పృథ్వీ స‌హా ప‌లువురు ఆర్టిస్టులు వైసీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎన్నికలలో వీరంతా వైసీపీ తరుపున ప్రచారం కూడా చేశారు. అయితే వీరంతా పార్టీలో త‌మ‌కు కీల‌క‌ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నే ఆశాభావంతో ఉన్నారు. అయితే తాజాగా అంబికా కృష్ణ‌ ఖాళీ చేసిన‌ ఆంధ‌ప్ర‌దేశ్ ఫిలిం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌దవి జ‌య‌సుధ అయితే బావుంటుందని జగన్ భావిస్తున్నారట. అయితే ఆయన అనుకున్నట్టుగా ఆ పదవిని జయసుధకి ఇచ్చేస్తే మిగిలిన వారికి ఏ పదవులు ఇస్తారు, వారిని ఏ విధంగా సంతృప్తిపరుస్తారు అనేది మాత్రం తెలియడంలేదు.