జగన్ అసలు సిసలు మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా..!

Monday, June 3rd, 2019, 12:00:11 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గత మూడు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, స్థితి గతులను చక్కదిద్దే ప్లాన్‌లో నిమగ్నమయ్యారు. అంతేకాదు ఇప్పటికే పింఛన్ల రెట్టింపు, ఉద్యోగాల ప్రకటన చేసి అందరి చేత శభాశ్ అనిపించుకున్నారు. అయితే వీలైనంత త్వరగా తన మంత్రివర్గ కేబినెట్‌ను కూడా ప్రకటించి ప్రజలకు మరింత సులువైన పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.

అయితే ఈ నెల 8వ తేదిన మంత్రి వర్గ కేబినెట్‌ను ప్రకటించి వారితో కూడా ప్రమాణస్వీకారం చేయించాలని, అదే రోజు కేబినెట్ సమావేశం కూడా నిర్వహించాలని జగన్ భావిస్తున్నారట. అయితే ఆ తరువాత ఎమ్మెల్యేలతో కూడా ప్రమాణస్వీకారం చేయించి ఇక తన పనిలో తాను నిమగ్నమైపోవాలని అనుకుంటున్నారట. అయితే జగన్ ఇవన్నీ ముగిసిన తరువాత జిల్లాల విభజనపై దృష్టి సారిస్తారని వైసీపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అయితే జగన్ ఇప్పటికే ప్రతి పార్లమెంట్‌లో ఒకరికి మంత్రి వర్గంలో స్థానం కలిపించేలా మొత్తం 20 మంది ఎమ్మెల్యేల వరకు తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే జిల్లాల విభజన కూడా ఇదే ప్రాతిపదికన జరుగుతుందని ఒక్కో పార్లమెంట్ స్థానాన్ని ఒక్కో జిల్లాగా మార్చబోతున్నారని దీనికోసం జగన్ తన పక్కా ప్రణాళికను సిద్దం చేసుకున్నారనే వార్తలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మాత్రం జగన్ ఇంకా ఎలాంటి పరిశీలనలు జరపలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా జిల్లాలా పెంపు మాత్రం జరుగుతుందని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఏ ఏ వాటిని కలిపి జిల్లాలు చేస్తారనేది ఇప్పుడు హాట్ టాఫిక్.