జగన్ షాకింగ్ నిర్ణయం : ఐదుగురు మంత్రులకి ఉద్వాసన

Thursday, July 11th, 2019, 09:48:01 AM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో ఎలాంటి అక్రమాలు,అవినీతి జరగకూడదంటూ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజు నుండి చెపుతూనే ఉన్నాడు. అయితే కొత్తగా వచ్చిన సీఎం చెప్పే మాటే కదా ఇదని జనాలు అనుకున్నారు, అలాగే ఆయన మంత్రి వర్గంలోని కొందరు మంత్రులు కూడా అనుకున్నారు. దీనితో జగన్ చెప్పిన దానిని పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు. మంత్రులుగా పదవులు చేపట్టిన కొద్దీ రోజుల్లోనే తమ చేతివాటం చూపించటానికి సిద్ధమయ్యారు. తమ తమ శాఖల్లో ఎక్కడ అవినీతికి ఛాన్స్ ఉంటుందో దానిని గుర్తించి గుట్టు చప్పుడు కాకుండా అక్రమాలకు తెరలేపారు.

దీనితో ఆ విషయం జగన్ వద్దకి చేరినట్లు తెలుస్తుంది. తన మంత్రి వర్గంలో ప్రధానంగా ఐదుగురు మంత్రులు అవినీతికి పాల్పడినట్లు సమాచారం జగన్ కి అందింది. అందులో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె మంత్రి కావటం ఆలస్యం, ఆమె భర్త అక్రమ దందాకు తెరలేపాడు. అలాగే కోస్తా లోని ఒక జిల్లాకి చెందిన సీనియర్ మంత్రి తానే జిల్లాకి పెద్ద దిక్కు అని, తాను ఏమి చేసిన అడిగేవాళ్ళు లేరని భావిస్తూ కోట్ల కోట్ల అవినీతికి పాల్పడినట్లు తెలుస్తుంది. అలాగే ఒక విద్యాసంస్థ సీజ్ ఓపెనింగ్ కి సంబదించిన విషయంపై ఆ శాఖ మంత్రిపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా జగన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

అలాగే ప్రజలకి అతి దగ్గరగా ఉండి సేవ చేసే మరో శాఖలో కూడా కాంట్రాక్టు విషయంలో అవినీతి జరిగినట్లు తెలుస్తుంది. ఇలాంటి డేటా మొత్తం జగన్ వద్దకి చేరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఐదుగురు మంత్రులకి జగన్ నుండి స్ట్రాంగ్ వార్నింగ్ లు వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే జగన్ కేవలం వార్నింగ్ ఇచ్చి సరిపుచ్చుతాడో లేక ఏమైనా చర్యలు తీసుకుంటాడో చూడాలి. 25 మంది మంత్రుల్లో అప్పుడే ఐదుగురు అవినీతి మంత్రులు బయటపడ్డారు. ఇంకా బయటకురాని వాళ్ళు ఎంత మంది ఉన్నారో..