ఢిల్లీకి బయలుదేరనున్న సీఎం జగన్…ఎందుకో తెలుసా?

Monday, October 21st, 2019, 07:29:36 AM IST

సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లికి బయలుదేరనున్నారు. ప్రజా సమస్యల పై, రాష్ట్ర పరిస్థితుల పై పలు విషయాల పై అమిత్ షా తో సహా పలు కేంద్ర మంత్రులతో చర్చిండానికి బయలుదేరనున్నారు. అక్కడే రాత్రికి బస చేసి 22 న వైజాగ్ వెళ్లనున్నారు. అక్కడ అరకు ఎంపీ మాధవి రిసెప్షన్ కి హాజరు కానున్నారు. తిరిగి రాత్రి తాడేపల్లిలో నివాసానికి చేరనున్నారని తెలుస్తుంది.

ఈరోజు అనగా సోమవారం ఉదయం 8 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం కి సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కావడం తో అక్కడ అమరవీరులకు సీఎం జగన్ శ్రద్ధాంజలి ఘటిస్తారు. భవిష్యత్ కార్యాచరణలో మాత్రమే కాకుండా, ప్రజలకు ఉపయోగకరమైన పథకాల, కార్యక్రమాల విషయం లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందుగా వున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఎం చర్చలు జరుపుతారో అని హాట్ టాపిక్ అయింది. టీడీపీ నేతలు సైతం జగన్ పర్యటన పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.