సీఎం జగన్ వ్యూహాలు, 40 ఏళ్ల రాజకీయ అనుభవానికి అర్ధం కావడం లేదట..!

Monday, June 10th, 2019, 11:06:46 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక దాని తరువాత ఒకటి నెరవేరుస్తూ పాలనలో తన ముద్రను వేసుకుంటున్నాడు జగన్.

అయితే జగన్‌కు రాజకీయాలలో పదేళ్ళ అనుభవం ఉన్నా ముఖ్యమంత్రిగా మాత్రం ఇదే మొదటి సారి. అయితే సీఎంగా జగన్ ఎక్కడ తప్పు దొర్లకుండా, ప్రతి పక్షాలకు తావు ఇవ్వకుండా తన సంచలన నిర్ణయాలతో 40 ఏళ్ల అనుభవానికి కూడా నాలుగు చెరువుల నీళ్ళు తాగిస్తున్నాడు. అయితే ఎన్నికలలో వైసీపీ చేతిలో ఘొరంగా ఓటమి పాలైన టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ పాలన చూస్తుంటే కడుపు రగిలిపోతుందట. సీఎం జగన్‌పై ఏదైనా విమర్శ చేద్దామనుకున్నా దానికి తావు లేకుండా చేసుకున్నాడు జగన్. అసలు తనకు సంబంధించిన మీడియాలో కూడా జగన్ ప్రస్తావన గురించి మాట్లడడంలేదు చంద్రబాబు. సీం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆలోచన ధోరణి చంద్రబాబు్‌కి అసలు అర్దం కావడం లేదు. మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని వర్గాల వారికి న్యాయం చేకూరుస్తూ ప్రతి ఒక్కరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించేలా తీసుకున్న నిర్ణయం పట్ల అందరితో ప్రశంసలు కురిపించుకుంటున్నాడు సీఎం జగన్. అయితే ఇవన్ని చూస్తున్న చంద్రబాబు చూస్తూ ఉండిపోవడం తప్పా ఏమీ మాట్లాడలేకబోతున్నాడు. అయితే ఇదంతా చూస్తున్న చంద్రబాబు 40 ఏళ్ల అనుభవానికి మాత్రం ఇక టీడీపీ అధికారంలోకి రావడం కష్టమే అని మాత్రం అర్ధమైపోయిందట.