హాట్ న్యూస్ : ఏపీ గ్రామ వాలంటీర్ల విషయంలో జగన్ సంచలన నిర్ణయం..?

Monday, July 13th, 2020, 10:34:44 AM IST

ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న పలు వినూత్న నిర్ణయాల్లో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కూడా ఒకటి అని చెప్పాలి. ఇది మాత్రం ఏపి రాజకీయ వర్గాల్లో ఒక కొత్త ఒరవడి అని చెప్పొచ్చు. అనేక విమర్శలు ఎదురైనప్పటికీ వాలంటీర్ ఉద్యోగాలను చేస్తున్న వారిలో భాద్యతో విధులు నిర్వహించే వారు కూడా చాలా మందే ఉన్నారని చెప్పాలి.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా 90 శాతం మన వాళ్ళకే ఉద్యోగాలు వచ్చిన వారు ఎలా చేస్తున్నారో కానీ నిజంగా ఈ వ్యవస్థ మాత్రం చాలా ఉపయోగకరంగా మారింది అని చెప్పాలి. ముఖ్యంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ప్రక్రియలో వీరు వారధిగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే వీరి సేవలకు గాను జగన్ ప్రభుత్వం కేవలం 5 వేల రూపాయల వేతనాన్ని చెల్లిస్తుంది.

కానీ ఇప్పుడు వీరి విషయంలో జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. వీరి జీతాన్ని 5 వేల నుంచి 7 వేల 500 కు పెంచాలని జగన్ అనుకుంటున్నట్టుగా అంతర్గత సమాచారం. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రానప్పటికీ ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో జగన్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై ఇంకా మరింత సమాచారం రావాల్సి ఉంది.