పోలవరంపై ఉన్నతాధికారులతో సమీక్షించిన ఏపీ సీఎం

Sunday, August 25th, 2019, 01:16:48 AM IST

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు కూడా విదేశీ పర్యటనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. కాగా నేడు ఉదయం తన నివాసానికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి… వచ్చి రాగానే పోలవరం పనులపైన పడ్డారు… కాగా గత కొంత కాలంగా పోలవరం ప్రాజెక్టు పనులపై, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రతీ విషయంలో విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో, నేడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో కొద్దీ సేపు సమీక్ష సమావేశం నిర్వహించారు. కాగా హైడల్ ప్రాజెక్టుపై నవయుగ సంస్థ కోర్టులో సవాల్ చేయడంతో పాటు, రివర్స్ టెండరింగ్ పథకం ముందుకు సాగకపోవడం అనేది, అందుకు తమ వైసీపీ ప్రభుత్వానికి మాంద్యంతర ఉత్తర్వులు రావడం లాంటి తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు కీలకమైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కాగా ఈ సమీక్ష సమావేశంలో తదితర సమస్యలపై సంబంధిత అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి… కాగా ఈ అంశాలన్నింటిపై చర్చించిన తరువాత ఒకవేళ ఏవేని న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలా పరిష్కరించుకోవాలన్న విషయంపై చర్చలు జరిపారని సమాచారం.