అమ్మ ఒడి పథకం అమలు పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్!

Thursday, May 28th, 2020, 07:26:45 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక పలు విప్లవాత్మక మార్పులకు తెరతీశారు. అందులో చెప్పుకోదగ్గ కీలక అంశం విద్యా రంగం. పేదవారికి సహాయం చేసేందుకు సీఎం జగన్ అమ్మ ఒడి పథకం తీసుకొచ్చారు. అయితే ఈ అమ్మ ఒడి పథకం ద్వారా ఇప్పటి వరకూ 82 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకురింది అని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

పాఠశాల లకు వెళ్లే విద్యార్థులు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకుంటారు అని, అందుకే వారి మధ్యాహ్న భోజనం లో కూడా సమూల మార్పులు చేపట్టాం అను సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా మన పాలన – మీ సూచన అంటూ ఒక కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు, తాను చేసిన పనులు పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మన పాలన మీ సూచన కార్యక్రమం లో విద్యా రంగం పై చర్చ జరిగింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మంత్రులు, అధికారులతో జగన్ ముఖాముఖి లో పాల్గొన్నారు. పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తూ, రోజుకో వెరైటీ తో మెనూ అమలు చేస్తున్నాం అని జగన్ వ్యాఖ్యానించారు.విద్యార్థులకు మార్చి 31 వరకు ఫీజుల కోసం 4200 కోట్ల రూపాయలు విడుదల చేశాం అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ బకాయిలు కూడా చెల్లించాం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.