సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి జగన్

Wednesday, January 15th, 2020, 03:00:26 AM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ లింగవరం రోడ్డులోని కన్వెన్షన్ లో నిర్వహించిన సంబరాల్లో జగన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కొడాలి నాని, పేర్ని నాని ముఖ్య వైసీపీ నేతలు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగుప్రజలందరికి జగన్ శుభాకాంక్షలు తెలియజేసారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతాంగం మీద ఇచ్చే గౌరానికి సంక్రాంతి పండుగ ప్రతీక అని జగన్ అన్నారు. అయితే ఈ సంబరాల్లో గన్నవరం ఎమ్మెల్యే వంశీ పాల్గొనడం గమనార్హం.

సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి కొడాలి నాని పుష్పగుచ్ఛము ఇచ్చి స్వాగతం పలికారు. చిన్నారుల తలపై భోగి పళ్ళు వేసి ఆశీర్వదించారు. సంక్రాంతి సంబరాల్లో పలు ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజలతో ఆప్యాయంగా కొద్దిసేపు మాట్లాడారు. గోమాతని నిమిరి సంతోషం వ్యక్త పరిచారు. సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ కి స్థానిక రైతులు ఎడ్లబండి జ్ఞాపికని బహుకరించారు.