బ్రేకింగ్: జగన్ ఈ విషయం లో ఎందుకు వెనకడుగేశారు?

Saturday, November 9th, 2019, 04:23:39 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇక ఇంగ్లీష్ మాధ్యమం తప్పని సరి చేసి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయం లో జగన్ వెనకడుగేసినట్లు తెలుస్తుంది. పాఠశాలలో 1 నుండి 8 వ తరగతి కి వచ్చే సంవత్సరం నుండి ఇంగ్లీష్ మాధ్యమం అమలు అవుతుందని జీవో జారీ చేసారు. మెల్ల మెల్లగా 1 నుండి 10 వరకు వివిధ దశల వారీగా అమలు చేసే ప్రయత్నాన్ని చేపట్టారు జగన్. కానీ ఇపుడు దానిని సవరించి 1 నుండి 6 వ తరగతి వరకు మాత్రమే అంటూ తెలిపారు. కొన్ని గంటల పటు అధికారులతో సమీక్ష నిర్వహించిన తరువాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.

అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై టీడీపీ, జనసేన, బీజేపీ లు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఇసుక కొరత విషయంలో ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం ఇప్పటివరకు విమర్శల పాలయ్యేలా వచ్చింది. అయితే ఆంగ్ల మాధ్యమ బోధనకు పూర్తీ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు లేనందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.