బిగ్ న్యూస్: వారిపై కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా చూపుతోంది – వై యస్ జగన్

Monday, March 30th, 2020, 07:54:39 PM IST

నిత్యావసరాల వస్తువలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించారు. ప్రకటించిన ధరల కంటే ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపుతాం అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే వచ్చే 15 రోజులకు అధికారులు నిత్యావసరాల వస్తువుల ధరలను ప్రకటించాలి అని, ప్రకటించిన ధరకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు. సూపర్‌ మార్కెట్లలో కూడా ఇవే ధరలకు విక్రయించాలి అని అన్నారు. ప్రతి దుకాణం వద్దా డిస్‌ప్లే బోర్టులు, దాంట్లో ఫిర్యాదు చేయాల్సిన కాల్‌ సెంటర్‌ నంబర్‌ ఉంచాలి అని జగన్ అన్నారు.

అయితే లాక్ డౌన్ నేపథ్యంలో రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు చూడాలి, అని వ్యవసాయ ఉత్పతుల తరలింపు మీద, గూడ్స్‌మీద ఆంక్షలు పెట్టకూడదు అని, సరుకుల రవాణాను అడ్డుకోవద్దు అని ఆదేశాలు ఇచ్చారు. కరోనాకు సంబంధించి మనం ఇప్పటివరకూ గట్టి చర్యలే తీసుకున్నాం అని, యంత్రాంగమంతా సమిష్టిగా పనిచేస్తున్నారు అని. గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పోలీసు సిబ్బంది పనితీరు బాగుంది అని సమావేశంలో జగన్ కొనియాడారు.

అయితే లాక్‌డౌన్‌ను పూర్తిగా సద్వినియోగంచేసుకోవాలి అని, తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోకపోతే లాక్‌డౌన్‌ ఉద్దేశం నెరవేరదు అని, పట్టణాల్లో ఉన్న వారి మీద కరోనా వైరస్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అని వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి అని సూచించారు. అయితే రెండు రకాల బృందాలతో కోవిడ్‌–19 నివారణా చర్యలను పటిష్టంగా చేపట్టాలి అని, మొదటి దశ టీంలో వార్డు వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాల ప్రైమరీ రీసోర్స్‌ పర్సన్లు, హెల్త్‌ సెక్రటరీ, అదనపు ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌ ఉంటారు అని జగన్ తెలిపారు. విదేశాలనుంచి వచ్చిన వారు ఉన్నా, లేకున్నా, ప్రతి ఇంటిమీదా దృష్టి పెట్టాలి అని అన్నారు.అయితే రెండో దశ టీంలో ప్రతి వార్డుకూ ఒక వైద్యుడ్ని ఏర్పాటు చేయాలి అని, మున్సిపాల్టీల్లో ప్రతి మూడు వార్డులకు ఒక డాక్టర్‌ను ఉంచాలి అని, మొదటి స్థాయి టీం నుంచి వచ్చే డేటాను ప్రతిరోజూ మానిటర్‌ చేసి ఆ మేరకు చర్యలు తీసుకోవాలి అని వ్యాఖ్యానించారు.

అయితే మొదటిరోజు ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించకపోవచ్చు, ఆతర్వాత కనిపించవచ్చు. అందకే ప్రతి రోజు కూడా ప్రతి ఇంటిని సర్వే చేయాలి అని సూచించారు. కరోనా వైరస్‌ సోకిన వారు ఇంట్లోనే వైద్యం తీసుకుంటూ కోలుకున్న సందర్భాలు ఉన్నాయి అని, అందువల్ల ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు అని వ్యాఖ్యానించారు. కాకపోతే ముందుగానే గుర్తించడం వల్ల బాగా మేలు జరుగుతుంది అని అన్నారు. వయస్సు ఎక్కువగా ఉన్నవారు, బీపీ, షుగర్‌ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారి మీద కరోనా వైరస్‌ ఎక్కువ ప్రభావం చూపుతోంది అని వ్యాఖ్యానించారు.