ఇంగ్లీష్ మీడియం అమలు పై వెనక్కి తగ్గని జగన్…మరొక కీలక నిర్ణయం!

Thursday, May 21st, 2020, 07:45:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో లో ప్రకటించిన హామీలతో పాటుగా, ప్రజల శ్రేయస్సు కోరుకోని మరి కొన్ని సంక్షేమ పథకాల్ని కూడా తీసుకు వచ్చారు. అయితే పేద ప్రజలు కూడా ఆంగ్ల మాధ్యమం లో చదవాలని, అపుడే వారి జీవితాలు బావుంటాయి అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంగ్ల మాధ్యమం తప్పని సరి చేస్తూ ఒక జీఓ ను జారీ చేశారు. అయితే న్యాయ స్థానాలు జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తప్పు బట్టినప్పటికి జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఇంగ్లీష్ మీడియం అమలు పై సర్వే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.ఒక ప్రముఖ థర్డ్ పార్టీ సంస్థ తో సర్వే చేయించాలని భావించింది. అయితే విద్యా రంగంలో ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన పలు సంస్కరణలు ప్రజలకు చేరేలా షార్ట్ ఫిల్మ్ లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఒక ఆంగ్ల ఛానల్ కి ఈ బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం.వీటి తో పాటుగా జగన్ సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.