ధరలు పెంచితే జైలుకు పంపడానికి కూడా వెనుకాడం – జగన్

Tuesday, March 24th, 2020, 02:40:25 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లాక్ డౌన్ లో ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూల్స్ బ్రేక్ చేసినవారిని అరెస్ట్ చేయడం చూశాం. అయితే నిత్యావసర ధరలు పెంచకుండా చర్యలు తీసుకుంటున్నాం అని వ్యాఖ్యానించారు. కూరగాయలు, సరుకులు అన్నింటికీ కలెక్టర్ ధరలు నిర్ణయిస్తారని తెలిపారు. అంతేకాకుండా త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ సమయంలో ధరలు పెంచితే జైలుకి పంపడానికి కూడా వెనుకాడం అని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే లాక్ డౌన్ చేసిన నేపధ్యంలో ప్రజలు నిత్యావసరాల విషయంలో కొంత ఆందోళన చెందుతున్న ట్లు తెలుస్తోంది. మరి వీటన్నిటి పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.