జగన్ సంచలన నిర్ణయం బెడిసికొట్టిందా?

Sunday, August 25th, 2019, 11:19:32 PM IST

వైసీపీ అధినేత మరియు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనకు గడ్డు కాలం మొదలయ్యిందా అంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయని చెప్పాలి.జగన్ మాటల్లో అద్భుతాలు చెప్తున్నారు కానీ చేతల్లోకి వచ్చేసరికి మాత్రం వారై ప్రభుత్వ వైఫల్యం చాలా అంశాల్లో కనిపిస్తుంది.వృద్దులకు పింఛన్లు ఇచ్చే దగ్గర నుంచి తాను తీసుకున్న 4 లక్షల గ్రామ వాలంటీర్ల నియామకాల ఉద్యోగాలు విషయంలో కానీ గడిచిన ఈ మూడు నెలల్లో సక్సెస్ కాలేకపోయారు.

గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల్లో అయితే జరిగిన అవకతవకలు అయితే అన్ని ఇన్ని కావు.పారదర్శకమైన పాలన అందిస్తానని చెప్పి వారి ఎమ్మెల్యేలకు ఎవరు ముడుపులు ముట్టజెప్పారో వారికే ఉద్యోగాలు కేటాయించుకున్నారని అనేక వార్తలు కూడా వచ్చాయి.సరే నియామకాలు జరిగాయి కానీ ఇప్పుడు జగన్ కు మరో సరికొత్త చిక్కు వచ్చి పడిందట.ఉద్యోగాలకు ఇప్పటికే 18 వేల మంది డుమ్మా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే.వాటిని భర్తీ చేసే లోపే ఈ ఉద్యోగాలు సంపాదించిన వారే విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.మొత్తానికి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం బెడిసి కొట్టేలా ఉందని అంతా అంటున్నారు.